Mega154 భారీ అప్డేట్

Leave a Comment


మెగాస్టార్ చిరంజీవి హీరోగా కేఎస్ రవీంద్ర(బాబీ) దర్శకత్వంలో #MEGA154 అనే వర్కింగ్ టైటిల్ తో ఓ యాక్షన్ ఎంటర్టైనర్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.

ఇందులో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా.. మాస్ మహారాజా రవితేజ ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారు.

తాజా అప్డేట్ ఏమిటంటే.. ఈ చిత్ర నిర్మాతలైన మైత్రీ మేకర్స్ ట్విట్టర్ ద్వారా మెగాస్టార్ 154 సినిమాకు సంభందించిన టైటిల్ టీజర్ అప్డేట్ ను ప్రకటించారు. అక్టోబర్ 24వ తేదీ ఉదయం 11:07 గంటలకు ఈ టైటిల్ టీజర్ ను విడుదల చేయబోతున్నట్లు తెలిపారు.

ఈ చిత్రం పై మెగా ఫ్యాన్స్ చాలా ఆశలు పెట్టుకున్నారు. మెగాస్టార్ ఈ సినిమాతో ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ కొడతారని వారి గట్టి నమ్మకంతో ఉన్నారు.

మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో నవీన్ యెర్నేని - వై రవిశంకర్ ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. జికె మోహన్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నారు. ఆర్థర్ ఎ విల్సన్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. ఎఎస్ ప్రకాష్ ప్రొడక్షన్ డిజైనర్ గా వర్క్ చేస్తున్నారు.

డైరెక్టర్ బాబీ ఈ చిత్రానికి కథ, మాటలు అందిస్తుండగా.. ప్రముఖ రచయిత కోన వెంకట్ - కె.చక్రవర్తి రెడ్డి కలిసి స్క్రీన్ ప్లే సమకూరుస్తున్నారు. హరి మోహన కృష్ణ మరియు వినీత్ పొట్లూరి కూడా రైటింగ్ డిపార్ట్మెంట్ లో ఉన్నారు. దీనికి నిరంజన్ దేవరమానే ఎడిటర్ గా.. సుస్మిత కొణిదెల కాస్ట్యూమ్ డిజైనర్ గా వర్క్ చేస్తున్నారు


Similar Links

0 comments:

Post a Comment