ఈసారి ఓన్లీ యాక్షన్ అంటున్న త్రివిక్రమ్

Leave a Commentసూపర్ స్టార్ మహేష్ బాబు గత కొంత కాలంగా మంచి ఫార్మ్ లో ఉంటూ తన సినిమా అంటే పక్కా హిట్ అన్నట్టే అన్న స్థాయికి వచ్చేశారు.  ఆ ఫార్మ్ ని కొనసాగించటానికి తన నెక్స్ట్ సినిమాని త్రివిక్రమ్ తో పెద్ద స్థాయి లో తయారు చేస్తున్నారు.


ఇక ఈ సినిమా విషయానికి వస్తే, త్రివిక్రమ్, మహేష్ బాబు ల క్రేజీ కాంబినేషన్లో ఇది వరకు వచ్చిన అతడు, ఖలేజా సినిమాలు మహేష్  కెరీర్ లో బెస్ట్ మూవీస్ లిస్ట్ లో ఉంటాయి. ఈ కాంబోకు 
తోడు మరో ఇంట్రస్టింగ్ అప్డేట్ వచ్చిందీ చిత్రం నుండి. స్వతహాగా ఫ్యామిలీ ఎంటర్టెనర్ లకు పెట్టింది పేరైన త్రివిక్రమ్, ఈసారి మాత్రం అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్ ను తెరకెక్కించబోతున్నట్లు భోగట్టా. ఈ మేరకు మహేష్ స్వయంగా త్రివిక్రమ్ ని యాక్షన్ డోస్ పెంచమని కోరినట్టు ఇప్పుడు ఫిలిం నగర్ లో చక్కర్లు కొడుతున్న న్యూస్. ఇదే కానీ నిజం అయితే ఫాన్స్ కి పండగే మరి, ఎందుకంటే మహేష్ ని యాక్షన్ రోల్ లో చూడాలి అని కొంత కాలంగా వాళ్ళు సోషల్ మీడియాలో అడుగుతున్న సంగతి తెలిసిందే.

ఇది కాక ఈ సినిమాలో ఒక ముఖ్య పాత్రలో నటించడానికి మలయాళం ఆక్టర్ ప్రిథ్వి రాజ్ ని  సంప్రదించినట్టు తెలుస్తుంది. ఆయన ఒప్పుకున్నారా లేదా అనే విషయం ఇంకా తెలియలేదు. ఒక వేళ అది గనక నిజమైతే సినిమా కి ప్యాన్ ఇండియా అప్పీల్ వచ్చేసినట్టే. ఇక కాన్వాస్ కూడా అదే రేంజ్ లో ఉంటుంది మరి.
ఇలా ఈ సినిమాలో సంబందించిన వార్తలతో ఆనందంలో మునిగి తేలుతున్నారు మహేష్ ఫాన్స్.


హారికా హాసిని బ్యానర్‌పై నిర్మించనున్న
ఈ సినిమాలో మహేష్‌కి జోడీగా పూజా హెగ్డే నటిస్తున్నారు. థమన్ మ్యూజిక్ అందిస్తున్నారు.  మది ఫోటోగ్రఫి అందిస్తున్నారు. త్వరలో షూటింగ్‌కు వెళ్లనున్న ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుని వచ్చే ఏడాది సమ్మర్ లో రిలీజ్ కానుంది. 

Similar Links

0 comments:

Post a Comment