ఇదేం లొల్లి టిల్లూ ?

Leave a Comment

 

Anupama Parameswaran opts out of DJ Tillu sequel

సిద్ధూ జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ జంటగా బ్లాక్ బస్టర్ 'డీజే టిల్లు'కి సీక్వెల్ తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో టిల్లు స్క్వేర్ అని టైటిల్ ఇటీవలే ప్రకటించారు. ఆ తర్వాత అనుపమ కొన్ని రోజులు షూటింగ్‌లో పాల్గొన్నారు. కాగా సినిమాలో హీరోయిన్ తనే అనే విషయాన్ని హీరో సిద్ధూ జొన్నలగడ్డ కూడా ఎంతో ఆర్భాటంగా ప్రకటించారు.

అయితే ఇప్పుడు ఈ సినిమా నుంచి అనుపమ పరమేశ్వరన్ తప్పుకునట్లు సమాచారం. సెట్స్‌లో అనుపమ, సిద్ధూ మధ్య తీవ్ర వాగ్వాదం జరిగినట్లు తాజాగా వార్తలు వినిపిస్తున్నాయి.

అసలు డీజే టిల్లు సీక్వెల్ మొదలైనప్పటి నుండీ అనేక సమస్యలు ఎదురయ్యాయి. మొదటి భాగానికి దర్శకత్వం వహించిన విమల్ కృష్ణ మొదట ఈ సీక్వెల్ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నారు. తర్వాత ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర కోసం శ్రీలీలని సంప్రదించారు. అయితే, 'కార్తికేయ 2' విజయం తర్వాత, నిర్మాతలు అనుపమ పరమేశ్వరన్ అయితే సరిపోతుందని భావించారు. 

తాజాగా అనుపమ కూడా ప్రాజెక్ట్ నుండి తప్పుకోగా ఆమె స్థానంలో మడోన్నా సెబాస్టియన్ అడుగుపెట్టనున్నారని తెలుస్తోంది. అయితే ఆమె పేరును నిర్మాతలు ఇంకా ధృవీకరించలేదు.

గత సంవత్సరం విడుదలైన "డీజే టిల్లు" అనూహ్యంగా బ్లాక్ బస్టర్ హిట్టయ్యింది. టైటిల్ పాత్రలో సిద్ధూ జొన్నలగడ్డ నటన, కామెడీ టైమింగ్ ప్రేక్షకులకి విపరీతంగా నచ్చేశాయి. అందుకే ఈ సినిమాకి సీక్వెల్ ప్రకటించిన రోజు నుండీ వాళ్ళు సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

అయితే ఈ క్రేజీ సీక్వెల్ కు ఇలా ప్రతిసారీ ఏదో ఒక అవాంతరం ఎదురవడం అందరిలోనూ చర్చనీయాంశంగా మారింది. సిద్ధూ జొన్నలగడ్డ స్క్రిప్ట్ లో జోక్యం చేసుకుంటున్నారని.. ఆ విషయం వల్లే ముందు దర్శకుడు, తరువాత హీరోయిన్లు సినిమా నుంచి వైదొలిగారని కొందరు అంటున్నారు. 

నిజానిజాలు తెలుసుకోకుండా అలా కామెంట్ చేయడం తప్పా కదా అన్న విషయం పక్కన పెడితే, డీజే టిల్లు' సీక్వెల్ లో జరుగుతున్న ఈ వివాదాలు చూసిన నెటిజన్లు మరియు సినీ ఔత్సాహికులు "ఇదేం లొల్లి టిల్లూ ?" అంటున్నారు.Similar Links

0 comments:

Post a Comment