Waltair Veerayya: వాల్తేరు వీరయ్య కొత్త పాట గురించి ఆసక్తికరమైన బిటిఎస్ వీడియో వదిలిన చిరంజీవి

Leave a Comment
Chiranjeevi shares an interesting BTS video of Waltair Veerayya's 5th Song


మెగాస్టార్ చిరంజీవి కొత్త చిత్రం వాల్తేరు వీరయ్య 2023 జనవరి 13 న గ్రాండ్ గా విడుదల కానుంది. తాజాగా ఈ సినిమా నుండి విడుదల చేసిన పూనకాలు లోడింగ్ అనే పాట ప్లే లిస్ట్ లని శాసిస్తుంది. ఇదిలా ఉండగా, త్వరలో విడుదల కానున్న ఈ చిత్రం యొక్క కొత్త పాట గురించి ఆసక్తికరమైన బిటిఎస్ వీడియోను చిరంజీవి విడుదల చేశారు.

ఫ్రాన్స్ లోని టౌలౌస్ నగరంలో చిత్రీకరించిన ఈ పాటకు "నీకెమో అందం ఎక్కువా నాకేమో తొందరె క్కువా" అని పేరు పెట్టారు. అభిమానులకు విందుగా ఉండే కొన్ని ప్రత్యేకమైన స్టెప్స్ ను శేఖర్ మాస్టర్ డిజైన్ చేశారని చిరంజీవి అన్నారు. కాగా ఈ బీటీఎస్ వీడియోలో చిరు చాలా అందంగా, స్టైలిష్ గా కనిపించారు.

ఆ పాట ఆకట్టుకునే లిరిక్స్ కలిగి ఉంటుందని, దేవిశ్రీ ప్రసాద్ మంచి మాస్ బీట్స్ ఇచ్చారని చిరంజీవి హామీ ఇచ్చారు. మాస్ మహారాజా రవితేజ ఈ చిత్రంలో ఒక ముఖ్యమైన పాత్రను పోషిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ సంస్థ ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తోంది.

మెగాస్టార్ చిరంజీవి ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా షేర్ చేసిన వీడియో చూడాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

Similar Links

0 comments:

Post a Comment