18 Pages Trailer: ఆసక్తికరంగా ఉన్న "18 పేజెస్" ట్రైలర్

Leave a Comment
Nikhil Siddharth and Anupama Parameswaran's 18 Pages Trailer is fascinating


యువ నటుడు నిఖిల్ తదుపరి చిత్రం 18 పేజెస్ కనిపించనున్న విషయం తెలిసిందే . ఈ చిత్రంలో గార్జియస్ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా నటించారు మరియు కార్తికేయ 2 తర్వాత ఈ వీరిద్దరూ మరోసారి బ్లాక్ బస్టర్ సాధించాలని చూస్తున్నారు. ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ ఈరోజు లాంచ్ చేయడం జరిగింది.

మొబైల్ ఫోన్, ఫేస్‌బుక్ అకౌంట్ ఇవేమీ తెలియని నందిని ( అనుపమ) పాత్ర పరిచయంతో ట్రైలర్ ప్రారంభమవుతుంది. కథానాయకుడిగా నటించిన నిఖిల్ ఆమె పై ఆసక్తిని పెంచుకుంటాడు. అయితే అకస్మాత్తుగా అనుపమ ఏదో ప్రమాదంలో చిక్కుకున్న దృశ్యాలు మనకు చూపించబడ్డాయి.

ఆ పై ట్రైలర్ యాక్షన్ పార్ట్‌కి మారుతుంది మరియు విజువల్స్ ఇక్కడ అద్భుతంగా కనిపిస్తాయి. క్యూట్ లవ్ స్టోరీతో పాటు థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కలగలిపిన చిత్రమిదని ట్రెయిలర్ చూస్తే తెలుస్తోంది. టైటిల్ లో 18 పేజెస్ హీరోయిన్ డైరీలోవి అని చెప్పకనే చెప్పారు. 

మొత్తానికి ఆసక్తికరమైన కథాంశంతో, అత్యున్నత నిర్మాణ విలువలతో రూపొందించిన ఈ ట్రైలర్ కట్ సినిమా పై ఆసక్తిని కలిగిస్తుంది.

బ్రహ్మాజీ, అజయ్ ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. పల్నాటి సూర్య ప్రతాప్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా, ఈ సినిమా కథను స్టార్ డైరెక్టర్ సుకుమార్ రాశారు. GA2 పిక్చర్స్ మరియు సుకుమార్ రైటింగ్స్ నిర్మించిన ఈ చిత్రం డిసెంబర్ 23, 2022న థియేటర్లలో భారీ స్థాయిలో రిలీజ్ కానుంది.


18 పేజెస్ ట్రైలర్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి



Similar Links

0 comments:

Post a Comment