Poonakalu Loading Song: అదిరిపోయిన DSP రాప్ ప్లస్ మాస్ మిక్సింగ్

Leave a Comment
Poonakalu Loading Song from Waltair Veerayya is a variety mix of Mass and Rap from Devisriprasad


మెగాస్టార్ చిరంజీవి, శృతి హాసన్ కాంబినేషన్ లో ప్రస్తుతం తెరకెక్కుతున్న మూవీ వాల్తేరు వీరయ్య. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై రవిశంకర్, నవీన్ ఎర్నేని ఎంతో భారీ స్థాయిలో నిర్మిస్తున్న ఈ సినిమా నుండి ఇప్పటికే రిలీజ్ అయిన మూడు పాటల ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుని సినిమా పై భారీ స్థాయి అంచనాలు ఏర్పడేలా చేశాయి. 

ఇక ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ నుండి మెగాస్టార్ తో పాటు మాస్ మహారాజా కలిసి చిందేసిన పూనకాలు లోడింగ్ సాంగ్ ని ఈ రోజు సాయంత్రం రెండు తెలుగు రాష్ట్రాల్లోని పలు ఎంపిక చేసిన థియేటర్స్ లో లాంచ్ చేశారు. ఈ పాట కోసం ఆయా థియేటర్లలో మెగా అభిమానులు మరియు మాస్ రాజా అభిమానులు భారీగా సంబరాలు జరుపుకున్నారు.

రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించిన ఈ పాటలోని బీట్ లు మరియు పాట హుక్ లైన్ అయిన " డోంట్ స్టాప్ డాన్సింగ్.. పూనకాలు లోడింగ్ " మాస్ ప్రేక్షకులని ఉర్రూతలూగించేలా ఉన్నాయి.

మెగాస్టార్ చిరంజీవి సిగరెట్ వెలిగించి వేసే స్టెప్, దానికి బ్యాక్ గ్రౌండ్ లో వచ్చే ఫ్లూట్ బిట్ సాంగ్ మొత్తానికే హైలైట్ గా నిలిచింది. ఇక పాట మధ్యలో మాస్ రాజా ఎంట్రీ ఆ పైన మెగాస్టార్ తో కలిసి వేసే స్టెప్ లు చూడటానికి ప్రేక్షకులు మరింత ఆసక్తితో ఉండేలా లిరికల్ వీడియోను రూపొందించారు.

ఈ సినిమాకి ఆర్ధర్ కె విల్సన్ ఫోటోగ్రఫి అందిస్తున్నారు. మాస్ మహారాజా రవితేజ కీలక పాత్ర చేస్తున్న ఈ చిత్రంలో బాబీ సింహా, రాజేంద్ర ప్రసాద్, క్యాథరీన్ త్రెసా వంటి వారు ఇతర కీలక పాత్రలు చేస్తున్నారు.

ఈ పాటలో ఇప్పుడు చూసింది చిన్న సెలబ్రేషన్ మాత్రమే అని, రేపు థియేటర్స్ లో ఇద్దరు హీరోల ఫ్యాన్స్ తో పాటు రేపు ప్రేక్షకులని ఈ మాస్ సాంగ్ విపరీతంగా అలరిస్తుందని అంటోంది వాల్తేరు వీరయ్య చిత్ర బృందం. కాగా ఈ సినిమాని సంక్రాంతి కానుకగా జనవరి 13న భారీ స్థాయిలో విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే.


Similar Links

0 comments:

Post a Comment