అవతార్-2 సినిమా విడుదల నేపథ్యంలో తెలుగు ప్రేక్షకులకు చిన్న నిరాశ

Leave a Comment

Hyderabad audience cannot enjoy Avatar 2 in IMAX screens

తెలుగు రాష్ట్రాల్లో 'అవతార్ 2' సినిమాని చూసి అద్భుతమైన అనుభూతి పొందాలనుకున్న సినీ అభిమానులకు నిరాశే ఎదురైంది. ఎందుకంటే కనీసం ఒక IMAX స్క్రీన్ అందుబాటులో లేదు. ఐమాక్స్ స్క్రీన్‌ పై పండోర ప్రపంచాన్ని కామెరూన్ 'అవతార్'ని మొదటిసారి చూసి ఆనందించారు.

కానీ ఇప్పుడు అలాంటి స్క్రీన్‌ పై కాకుండా సాధారణ స్క్రీన్‌ లలోనే ఆ అనుభూతిని తిరిగి పొందడం అసాధ్యం. పైగా అవతార్2 ని ప్రత్యేకంగా ఐమాక్స్ 3డి ఫార్మాట్‌లో రూపొందించారు. మరి ఆ స్థాయి విజువల్స్ ని మాములు తెర పై చూడడం అనేది కాస్త అసంతృప్తిని కలిగించే విషయమే కదా. నిజానికి ఇది వరకు హైదరాబాద్ ప్రసాద్స్ మల్టీప్లెక్స్‌లో ఐమాక్స్ స్క్రీన్ ఉండేదిఅయితే తర్వాత కొన్ని పరిస్థితుల వల్ల ఆ స్క్రీన్ ను సాధారణ స్థితికి మార్చారు. అప్పటి నుంచి తెలుగు ప్రేక్షకులకు ఐమాక్స్ స్క్రీన్ అందించడం  కోసం ఎలాంటి ప్రయత్నం జరగకపోడం బాధకరమైన విషయమే. 

ఇక ఇటీవల వినిపిస్తున్న వార్తల ప్రకారం ప్రముఖ అగ్ర మల్టీప్లేక్స్ సంస్థ పీవీఆర్ హైదరాబాద్ మహానగరంలో ఐమాక్స్ స్క్రీన్ తెచ్చే ప్రయత్నం చేస్తోందని తెలుస్తోంది.

అయితే ఆ ప్రయత్నం పూర్తి స్థాయిలో రూపు దాల్చడానికి ఎంత లేదన్నా ఒక సంవత్సరం సమయం పడుతుంది. ఏదేమైనా ఐమాక్స్ స్క్రీన్ పై అవతార్ 2 చూసే అవకాశం మన వాళ్లకి దక్కకుండా పోయింది. ఇతర దక్షిణ రాష్ట్రాలైన తమిళ నాడు మరియు కర్ణాటకలోని ప్రేక్షకులకు మాత్రం ఐమాక్స్ వినోదం అందుబాటులో ఉంటుంది. ఎందుకంటే అక్కడి ధియేటర్లలో ఐమాక్స్ ఫార్మాట్ ఎప్పటినుంచో ఉంది.

ఇక అవతార్ 2 డిసెంబర్ 16న ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కానుంది. కాగా ఈ విజువల్ వండర్ ను చూసి ఆనందించాలని ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఇక ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ నిన్ననే విడుదలవగా.. సినిమా పై ప్రేక్షకులలో ఉన్న అంచనాలను తారా స్థాయికి తీసుకువెళ్ళింది. ప్రఖ్యాత దర్శకుడు జేమ్స్ కెమరూన్ అభిమానులు ఈ సినిమాతో ఆయన మరోసారి అవార్డులతో పాటు రివార్డులు కూడా పొందుతారని గట్టి నమ్మకంతో ఉన్నారు.

Similar Links

0 comments:

Post a Comment