తెలివిగా తప్పించుకున్న దిల్ రాజు

Leave a Comment

Dil Raju cleverly divertred the real issue in ABN RK interview


సంక్రాంతి సినిమాల థియేటర్ల నియామక వివాదం కారణంగా నిర్మాత దిల్ రాజు ఇటీవల సమస్యలకు కేంద్రబిందువయ్యారు. చిరంజీవి, బాలకృష్ణ సినిమాల కంటే దిల్ రాజు తన స్వంత సినిమా అయిన వారసుడు సినిమాకే ఎక్కువ థియేటర్లు కేటాయిస్తున్నారు అని ఆయన పై విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే.

కాగా ఈ అగ్ర నిర్మాత చాలా రోజులుగా ఈ సమస్య పై వ్యూహాత్మకంగా మౌనం వహించినా.. ఇటీవలే ఒక సినిమా ఫంక్షన్ లో త్వరలోనే మాట్లాడతానని తెలిపారు. ఇక తాజాగా ABN ఛానెల్ లోని ఓపెన్ హార్ట్ విత్ RK ఇంటర్వ్యూలో దిల్ రాజు తన పై వచ్చిన విమర్శల గురించి మాట్లాడారు.

అయితే ఈ సందర్భంగా దిల్ రాజు చేసిన తెలివైన ఎత్తుగడ ఏమిటంటే.. ధియేటర్లు వారసుడు సినిమాకి ఎక్కువ కేటాయిస్తున్న విషయం తప్ప మిగతా వాటి గురించే మాట్లాడారు. 2019 లో పెట్టా సినిమా సడెన్ గా సంక్రాంతికి విడుదల అవుతుందని ప్రకటించారని.. కానీ వారసుడు సినిమాకి మాత్రం సినిమా ప్రారంభం అయిన రోజే తాము సంక్రాంతి విడుదల అని ప్రకటించామని ఆయన అన్నారు.

అలాగే.. 91 ఏళ్ల తెలుగు సినీ పరిశ్రమలో ఏ ప్రొడక్షన్‌ హౌస్‌ చరిత్రలో కూడా లేని విధంగా సంక్రాంతికి ఓకే బ్యానర్ నుంచి రెండు సినిమాలు విడుదల చేస్తున్నారని ఎత్తి చూపి చాకచక్యంగా వ్యవహరించారు.

తన వద్ద 37 థియేటర్లు మాత్రమే ఉన్నాయని, సినిమా విడుదలలను తాను ప్రభావితం చేయలేనని చెప్పడం గమనార్హం. ఇలా అసలు ప్రశ్నను దాటవేస్తూ దిల్ రాజు తన వాదనను తెలివిగా నెట్టారు.

అసలు సమస్య ఈ సంక్రాంతికి ఈ పండుగ సీజన్‌లో విడుదలయ్యే డబ్బింగ్ సినిమా కానే కాదు. చిరంజీవి, బాలకృష్ణ సినిమాల కంటే వారసుడికి ఎక్కువ థియేటర్లు, మంచి థియేటర్లు లభించడం అనేదే అసలు సమస్య.

ఆ ఒక్క విషయం తప్ప మిగతా అన్నిటి గూర్చి మాట్లాడి దిల్ రాజు తెలివిగా తప్పించుకున్నాను అని భావిస్తూ ఉండవచ్చు. ఇప్పుడు ఈ ప్రశ్నను దాటవేసినట్లే.. రేపు సంక్రాంతి సినిమాల విడుదల సమయంలో కూడా మరో కొత్త లాజిక్ తో వస్తారు అని ఇంటర్వ్యూ చూసిన సినీ ప్రేమికులు అంటున్నారు. అందులో నిజం లేకపోలేదు. సమస్యను పక్కన పెట్టేసి తన తప్పేమీ లేదన్నట్లు బుకాయించడం దిల్ రాజు కే చెల్లింది.


Similar Links

0 comments:

Post a Comment