బ్రో ఐ డోంట్ కేర్ అంటున్న బాలయ్య

Leave a Comment

 

Bro I don't care is the Title of Nandamuri Balakrishna new movie

నందమూరి బాలకృష్ణ మరియు సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్ లో ఓ పవర్ ఫుల్ మూవీ రాబోతోంది. ఈరోజు ఉదయం 9.36 గంటలకు హైదరాబాద్ లో ఈ సినిమా లాంఛనంగా ప్రారంభం అయింది. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ సినిమాకి " బ్రో ఐ డోంట్ కేర్ ( Bro I Don't Care) టైటిల్ ను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.

కాగా ఈ సినిమా కోసం హైదరాబాద్ లో జైలు సెట్ వేసి, ఈ సెట్ లో మొదటి షెడ్యూల్ ను పూర్తి చేయనున్నారు. బాలకృష్ణ కోసం కొత్త లుక్ డిజైన్ చేసి ఆ లుక్ ను రహస్యంగా ఉంచారు. మొదటి షెడ్యూల్ 12 రోజుల పాటు జరుగుతుందట.ఇక ఈ సినిమాలో బాలకృష్ణ కుమార్తెగా శ్రీలీల, హీరోయిన్ గా ప్రియాంక జవాల్కర్ నటిస్తున్నట్లు సమాచారం. థమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి అఖండ ఫేమ్ రామ్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. షైన్ స్క్రీన్స్ ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని నిర్మిస్తోంది మరియు ఎన్బికె 108 (NBK108) వచ్చే ఏడాది విడుదల కానుంది. 

బాలకృష్ణ ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో 'వీరసింహారెడ్డి' సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కానుంది.


Similar Links

0 comments:

Post a Comment