ఇంకోసారి అంటున్న తెలుగు సినిమా!

Leave a Comment


ఒకప్పుడు తెలుగు సినీ పరిశ్రమలో ఫలానా  
సినిమా తాలూకు మొదటి థియేట్రికల్ రన్ పూర్తయ్యాక డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు పాత సినిమాలను ప్రదర్శించేవారు. ఈ పద్ధతి సినిమా విడుదలైన కొన్ని సంవత్సరాల తర్వాత మరొక సినిమాని మళ్ళీ విడుదల చేయడానికి సరైన సందర్భం లేదా మహాశివరాత్రి వంటి పండుగలు ఉన్నప్పుడు జరిగేది.

డిస్ట్రిబ్యూటర్‌లు మరియు ఎగ్జిబిటర్‌ల మధ్య కమర్షియల్ లెక్కలతో కూడిన సమన్వయంతో ఈ రీ రిలీజ్‌లు జరిగేవి, అయితే ఇలా చేయడం వల్ల వాళ్ళకి కొద్దో గొప్పో లాభాలు కూడా ముట్టేవి . అభిమానులు లేదా సినీ ఔత్సాహికులు కూడా పెద్ద స్క్రీన్‌ పై మరోసారి తమ అభిమాన హీరోలు లేదా సినిమాలను చూడటానికి ఆనందంగా వచ్చేవాళ్ళు.

క్షణ క్షణం, ఖైదీ, రాక్షసుడు, జగదేక వీరుడు అతిలోక సుందరి మొదలైన సినిమాలు రీ రిలీజ్ కాబడి మంచి బిజినెస్ చేశాయి. అలాగే మాయాబజార్, లవకుశ, సంపూర్ణ రామాయణం, కీలు గుర్రం, గుండమ్మ కథ, మిస్సమ్మ మొదలైన కల్ట్ క్లాసిక్‌లను ఇలా మళ్ళీ విడుదల చేసిన అనేక సందర్భాలు ఉన్నాయి.

అయితే ప్రస్తుతం తెలుగు సినిమా పరిశ్రమలో కొత్త ట్రెండ్‌ కనిపిస్తోంది, ఇంతకు ముందు కూడా ఇలాంటివి జరగడం చూశాం, ప్రస్తుతం సెలబ్రేషన్స్ పేరుతో హీరోల పుట్టినరోజు సందర్భంగా ఫ్యాన్స్ స్పెషల్ షోలు చేయడం చూస్తున్నాం.

పాత హిట్ సినిమాని తీసుకుని, దాని ప్రింట్‌ ని రీమాస్టర్ చేసి పాత ప్రింట్‌ని మార్చడం, దానిని 4K రీమాస్టర్డ్ వెర్షన్‌కి మార్చి వారి హీరో పుట్టినరోజున ప్రదర్శించడం ఇప్పుడు సరికొత్త పద్ధతిగా పాటిస్తున్నారు.

ఇటీవల సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఒక్కడు మరియు పోకిరి సినిమాలు స్పెషల్ షోలు వేసుకుని భారీ సందడి చేయడం చూశాం, అభిమానుల వేడుకల వీడియోలతో సోషల్ మీడియా దద్దరిల్లింది, ఆ తర్వాత 30 ఏళ్ళ క్రితం ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్ అయిన మెగాస్టార్ చిరంజీవి ఘారానా మొగుడు మళ్లీ విడుదలైంది. 
చిన్నపాటి సాంకేతిక అవాంతరాలు జరిగినప్పటికీ అభిమానుల ఆనందాన్ని అవి ఆపలేకపోయాయి.

ఇక ఇప్పుడు పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ వంతు.. తమ్ముడు మరియు జల్సా (4కK) సినిమాని పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేస్తున్నారు. వీరిని చూసి ప్రభాస్ అభిమానులు మేము మాత్రం తక్కువ తిన్నామా అంటూ బిల్లా సినిమా రీ మాస్టర్ వెర్షన్ త్వరలో ప్రేక్షకుల ముందుకు తేనున్నారని సమాచారం.

వైజయంతి సినిమా బ్యానర్ 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా వచ్చే ఏడాది ఇంద్ర సినిమా రీమాస్టర్డ్ వెర్షన్ విడుదల కానున్న విషయం తెలిసిందే.

పాత రోజుల్లో రీ-రిలీజ్ యొక్క ఉద్దేశ్యం స్పష్టంగా లెక్కించబడగా.. ప్రస్తుతం రి రిలీజ్ ల ట్రెండ్ చూస్తుంటే మాత్రం ఇది ఎక్కువగా అభిమానుల భావోద్వేగాలు మరియు ప్రతిచర్యతో కూడుకున్నట్లు కనిపిస్తుంది, అందుకు ట్విట్టర్‌లో జరుగుతున్న వికృత వాదనలు మరియు ట్రోల్స్ ఏ సాక్ష్యంగా చెప్పుకోవచ్చు.

పోస్ట్ రిలీజ్ నంబర్ గేమ్‌లను పక్కన పెడితే, తెలుగు సినిమా "ఇంకోసారి" అంటే సినీ అభిమానులు మేము సై అంటున్నారు

Similar Links

0 comments:

Post a Comment