ఏదైనా బాలయ్య దిగనంత వరకే

Leave a Commentనందమూరి బాలకృష్ణ తన సుదీర్ఘ సినీ ప్రస్తానంలో ఎప్పుడు లేనంత ఉత్సాహంగా ఉరకలేస్తున్నారు. మూడు దశాబ్దాల పైన స్టార్ హీరోగా వెలుగొందుతూ తనకంటూ ప్రత్యేక పేరుని సంపాదించుకున్న ఈ నందమూరి నట సింహం ఇప్పుడు యాడ్స్ లోకి దిగారు. 

యాడ్స్ అనగానే తెలుగు సినిమా పరిశ్రమలో గుర్తొచ్చే పెద్ద హీరోల పేర్లు అల్లు అర్జున్, మహేష్ బాబు, రామ్ చరణ్, ఎన్టీఆర్, విజయ్ దేవరకొండ. అడపా దడపా ప్రభాస్ కూడా యాడ్స్ చేసినా మరి ఎక్కువ కాదనే చెప్పుకోవాలి. ఇలా ఇప్పటికే పోటాపోటీగా ఉన్న రంగం లోకి బాలయ్య బాబు ఎంట్రీ సీన్ ని రక్తి కట్టిస్తుంది అనటంలో సందేహం లేదు.

ఇక యాడ్ విషయానికి వస్తే ఇదొక రియల్ ఎస్టేట్ కంపెనీ గురించి, సాయి ప్రియా గ్రూప్ . 25 సంవత్సరాలుగా కన్స్ట్రక్షన్ లో ఉన్న వీరికి బాలయ్య తన గాంభీర్యం తోడు చేసి తన మాటలు, డిక్షన్ తో ఒక ఇంపాక్ట్ ఇచ్చే యాడ్ నే ఇచ్చారు. దానిలో తన బ్లాక్బస్టర్ సినిమా 'లెజెండ్' రిఫరెన్స్ ఉండటం అభిమానులకి ఇంకా ఆనందం ఇచ్చే విషయం. బాలయ్య బాబు ని అందంగా చూపించటంలో, ఆయన బాడీ లాంగ్వేజ్ ని వాడుకునే విధానంలో ఈ యాడ్ డైరెక్టర్ నూటికి నూరు పాళ్ళు విజయం సాధించారనే చెప్పాలి.

ఇది ఒక మంచి యాడ్ అవ్వటం, అది కూడా బాలయ్య బాబు ఎంట్రీ ఇవ్వటంతో ఇప్పుడు ఈ కమర్షియల్ యాడ్స్ ఫీల్డ్ మంచి రసవత్తరంగా తయారౌతుంది అనటంలో సందేహం లేదు. ఎందుకు అంటే ఇప్పటి వరకు బాలయ్య బాబుని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు కూడా ఇప్పుడు బాలయ్య కాల్ షీట్ల కోసం పరుగులు పెడతారు. బాలయ్య కానీ ఒప్పుకుంటే వేరే హీరోకి కి వెళ్లే అవకాశం ఇక్కడ ఆగిపోయినట్టే మరి.

"ఏమయ్యా బాలయ్య, ఇదేమన్నా న్యాయమా నీకు. ఇప్పటికే సినిమాల్లో పోటీ గా ఉన్నావు, ఇప్పుడు యాడ్స్ లోకి కూడా వస్తే మేమెక్కడికి వెళ్ళేది" అని ఇతర హీరోలు అనుకోక తప్పదు మరి.


Similar Links

0 comments:

Post a Comment