చిరంజీవి గాడ్‌ఫాదర్ అనుభవం నుంచి ఏమీ నేర్చుకోలేదా?

Leave a Comment

 


ఒక సినిమా విజయం సాధించడం అనేది అన్ని వేళలా కేవలం సినిమా కంటెంట్ మీదే ఆధార పడి ఉండదు. ఆ సినిమాని ఎలా ప్రచారం చేస్తున్నారు అనే విషయంతో పాటు చేసుకున్న బిజినెస్ కు సరిపోయే విధంగా రిలీజ్ చేసుకోవడం వంటి విషయాల పై కూడా ఆధారపడి ఉంటుంది.

ఉదాహరణకు ఈ దసరా పండగకు విడుదల అయిన మెగాస్టార్ చిరంజీవి గాడ్‌ఫాదర్ సినిమాకు సోలో రిలీజ్ కాకపోవటంతో పాటు థియేటర్‌లు సరిగా హోల్డ్ చేయకపోవటం ఓపెనింగ్స్ లో కనిష్టంగా 10 - 15 కోట్ల వ్యత్యాసం వచ్చిందని ట్రేడ్ వర్గాలు అభిప్రాయ పడ్డాయి. అందువల్ల ఒక పెద్ద హీరో ఓపెనింగ్ రోజు వచ్చే కలెక్షన్లు రాలేదు. ఇక పాజిటివ్ టాక్ తో మొదటి అయిదు రోజులు హౌస్ ఫుల్స్ నమోదు చేస్తూ రన్ అయినా కూడా చాలా సెంటర్స్ లో టాక్ కి తగ్గట్టు అదనపు షోలు మరియు థియేటర్లను పెంచుకొలేకపోయారు.

ఓపెనింగ్స్ లో కోత పడటంతో పాటు టాక్ వచ్చిన తరువాత కూడా థియేటర్ల నిర్వహణ సరిగా లేనందున గాడ్‌ఫాదర్ సినిమా రన్ ముగిసేసరికి చేయాల్సిన బిజినెస్ కంటే చాలా తక్కువ చేసే పరిస్థితి ఏర్పడింది.

సరే జరిగింది ఏదో జరిగింది.. ఇక నుంచి వచ్చే సినిమాల పట్ల అయినా మెగాస్టార్ చిరంజీవి పీఆర్ టీమ్ లేదా ఆయన సన్నిహిత బృందం జాగర్త వహిస్తారు అని అభిమానులు ఆశించారు. ఐతే తాజాగా వినిపిస్తున్న వార్తల ప్రకారం సంక్రాంతికి విడుదల కాబోతున్న మెగా154 సినిమా విషయంలో కూడా అదే జరగబోతుంది అని సమాచారం.

నిజానికి సినిమాకి మంచి బజ్ ఉన్నా.. సోలో రిలీజ్ వల్ల వచ్చే లాభాలు కూడా గణనీయంగా ఉన్నా ప్రముఖ నిర్మాత మరియు భారీ పంపిణీదారుడు అయిన దిల్ రాజు ఒత్తిడికి Mega154 నిర్మాతలు తలోగ్గి జనవరి 11 తేదీని వదిలేసినట్లు ఇండస్ట్రీ టాక్ నడుస్తోంది. ఆ తేదీన ఇప్పుడు దిల్ రాజు తమిళ హీరోతో నిర్మిస్తున్న వారిసు (తెలుగులో వారసుడు) చిత్రం విడుదల కావచ్చని భోగట్టా.

2017 లో ఖైదీ నంబర్ 150 మరియు గౌతమి పుత్ర శాతకర్ణి సినిమాకు పోటీగా విడుదలయినప్పుడు గౌతమి పుత్ర శాతకర్ణి కన్నా ఒక్క రోజు ముందు వచ్చిన ఖైదీ నంబర్ 150.. 35 కోట్లకు పైగా ఓపెనింగ్ సాధించిన విషయం అందరికి తెలిసిందే.

మరిప్పుడు మెగా 154 జనవరి 11న కాకుండ దిల్ రాజు డిసైడ్ చేసినట్టు 13న రిలీజ్ చేస్తే ఓపెనింగ్స్ (సాధారణంగా చిరుకి భారీ అడ్వాంటేజ్) పోయినట్టే అని అభిమానులు వాపోతున్నారు.

థియేటర్స్ హోల్డ్ చేయటంలో ముఖ్యంగా నైజాం ఏరియాలో ఏషియన్ సంస్థ ఇటీవలే గాడ్ ఫాదర్ విషయం లో ఫెయిల్ అయ్యారు. అయినా మెగా154 నైజాం రిలీజ్ వాళ్ళకే ఇచ్చినట్టు వార్తలు వస్తున్నాయి.

ఈ వ్యవహారం అంతా చూస్తూ ఉంటే.. ఇంతకీ చిరు గాడ్ ఫాదర్ అనుభవం నుంచి ఏమైనా నేర్చుకున్నారా లేదా అనే అనుమానం అటు మెగా అభిమానులతో పాటు ట్రేడ్ ఔత్సాహికుల మెదడుని తొలిచేస్తోంది.

నిజానికి చిరంజీవి గారి కమ్ బ్యాక్ తరవాత రిలీజ్ చేసిన నాలుగు సినిమాల లోనూ ఎంత కాదన్నా ఈ సమస్యను ప్రతి సినిమాలో చూస్తూనే వచ్చాము, ఇది కేవలం గాడ్‌ఫాదర్ సినిమాకో లేదా మెగా154 కో కొత్తగా చూస్తున్న సమస్య కాదు, ఇలా ప్రతి సినిమా రిలీజ్ ఎప్పుడు మొదలయ్యే ఈ వ్యవహారంలో చిరంజీవి గారు జోక్యం చేసుకుంటే , మొన్న గాడ్‌ఫాదర్ సక్సెస్ మీట్ లో మోహన్ రాజా చెప్పినట్టు ఆయన అనుభవాన్ని ఉపయోగించుకుంటే బాగుండు అని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు.


Similar Links

0 comments:

Post a Comment