మైఖేల్ టీజర్ రివ్యూ

Leave a Comment


యువ హీరో సందీప్ కిషన్ నటిస్తున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ''మైఖేల్''. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ప్యాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న చిత్రానికి రంజిత్ జయకోడి దర్శకత్వం వహిస్తున్నారు.

ఇందులో సందీప్ సరసన దివ్యాంశ కౌశిక్ హీరోయిన్ గా నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ కు ప్రేక్షకుల నుంచి చక్కని స్పందన వచ్చింది. ఈ నేపథ్యంలో తాజాగా అన్ని భాషల్లో ఈ సినిమా తాలూకు టీజర్ ను మేకర్స్ ఆవిష్కరించారు.

కాగా "మైఖేల్" టీజర్ ను తమిళ స్టార్ హీరో ధనుష్ , అలాగే మలయాళ సూపర్ స్టార్ దుల్కర్ సల్మాన్ - నేచురల్ స్టార్ నాని - కన్నడ హీరో రక్షిత్ శెట్టి - బాలీవుడ్ యాక్టర్ రాజ్ కుమార్ రావ్ - హీరోయిన్లు రకుల్ ప్రీత్ సింగ్ మరియు జాన్వీ కపూర్ - దర్శక ద్వయం రాజ్ & డీకే వంటి సినీ ప్రముఖులు విడుదల చేసారు.

ఇక మైఖేల్ టీజర్ ఎలా ఉందంటే..

' మైఖేల్.. వేటాడటం రాని జంతువులే వేటాడే నోటికి చిక్కుతాయి' అనే డైలాగ్ కి.. 'వెంటాడి ఆకలిని తీర్చుకోడానికి వేటాడటం తెలియాల్సిన పనిలేదు మాస్టర్' అని సందీప్ కిషన్ చెప్పే డైలాగ్ తో ఈ టీజర్ ప్రారంభం అవుతుంది. టీజర్ లో దాదాపుగా యాక్షన్ సన్నివేశాలే ఉన్నాయి. బ్యాక్ గ్రౌండ్ లో డైలాగ్స్, టీజర్ లో ఉన్న కలర్ టోన్ చూస్తుంటే ఇది ఒక రేసి యాక్షన్ థ్రిల్లర్ లా కనిపిస్తుంది. కాగా ఈ టీజర్ చూసిన కొంత మంది నెటిజన్లు.. ఇది కమల్ హాసన్ నటించిన విక్రమ్ సినిమా తరగాలి నాన్ స్టాప్ యాక్షన్ థ్రిల్లర్ లా ఉందని అభిప్రాయ పడ్డారు. 

ప్రస్తుతం నడుస్తున్న ట్రెండ్ ప్రకారం.. ఇలాంటి యాక్షన్ నేపథ్యంలో వచ్చిన సినిమాలు విజయం సాధించే అవకాశాలు ఎక్కువే అని చెప్పాలి. ఇక టీజర్ లో యాక్షన్ తో పాటు రొమాన్స్ కూడా ఉంది. హీరో సందీప్ కిషన్ - దివ్యాంశా కౌశిక్ ల మధ్య లిప్ లాక్ సీన్ మనం చూడవచ్చు. చాలా కాలంగా సరైన హిట్ కోసం చూస్తున్న హీరో సందీప్ కిషన్ కు ఈసారి ఆ హిట్ వచ్చెలానే కనిపిస్తుంది.

ఈ చిత్రంలో మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి ఒక ముఖ్య పాత్రలో నటించగా.. తమిళ దర్శకుడు, నటుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్ కూడా టీజర్ లో కనిపిస్తున్నారు. వరుణ్ సందేశ్ - వరలక్ష్మి శరత్‌ కుమార్ - అయ్యప్ప శర్మ - అనసూయ భరద్వాజ్ తదితరులు ఇతర కీలక పాత్రలు పోషించారు. 

మైఖేల్'' చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ మరియు కరణ్ సి ప్రొడక్షన్స్ ఎల్ఎల్పి బ్యానర్స్ పై భారీ స్థాయిలో రూపొందిస్తున్నాయి. భరత్ చౌదరి మరియు పుస్కూర్ రామ్ మోహన్ రావు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. శ్యామ్ సీఎస్ సంగీతం సమకూర్చగా.. కిరణ్ కౌశిక్ సినిమాటోగ్రఫీ నిర్వహించారు. గాంధీ నడికుడికార్ ఆర్ట్ డైరెక్టర్ గా వర్క్ చేయగా.. ఆర్ సత్యనారాయణన్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.Similar Links

0 comments:

Post a Comment