పవన్ కళ్యాణ్ పై బురద జల్లే ప్రయత్నం?

Leave a Comment


తెలుగు నాట సినిమాలకీ రాజకీయాలకి గత కొన్ని దశాబ్దాలుగా అవినాభావ సంబంధం కొనసాగుతూనే ఉంది. ఎన్టీఆర్ లాంటి నటులు ప్రభంజనం సృష్టించి ముఖ్యమంత్రి అవ్వగా ఆ బాటలో ఇతరులు వచ్చి వారి ప్రయత్నం చేస్తూనే ఉన్నారు, కొంత మంది పదవులని అలంకరిస్తే మరి కొందరికి చేదు అనుభవాలు మిగిలాయి. 


ఇక విషయానికి వస్తే మొన్న వైజాగ్ లో జనసేన జనవాణి కార్యక్రమం కోసం పవన్ కళ్యాణ్ వెళ్ళటం, ఆయన్ని హోటల్ లోనే బయటకి రానివ్వకుండా ఉంచటం, ఆయన చేసేదేం లేక వెనక్కి తిరిగి వచ్చి ఘాటుగా ప్రభుత్వాన్ని విమర్శించటం, దానికి ప్రభుత్వ మంత్రులు తిరిగి ఘాటు వ్యాఖ్యలు చెయ్యటం అన్ని చకచకా జరిగిపోయాయి. 

ఇప్పుడు ఈ విషయమే ప్రభుత్వానికి నెగటివ్ అవుతుంది అనుకున్నారో, లేక ఇప్పటి వరకు ఇచ్చిన సమాధానం సరిపోలేదనుకున్నారో ఏమో కానీ రంగంలోకి రామ్ గోపాల్ వర్మ ఎంటర్ అయ్యారు. నిన్న ఆయన జగన్ తో కలిసి 40 నిముషాలు పాటు భేటీ అయ్యారు. ఇప్పుడు ఈ విషయమే పొలిటికల్ గా కాకుండా ఫిలిం నగర్ సర్కిల్స్ లో కూడా హాట్ టాపిక్ గా మారింది. ఏంటి రా వినిపించే వార్త అంటే పవన్ కళ్యాణ్ మీద త్వరలోనే రామ్ గోపాల్ వర్మ పేరడీ సినిమాలు తీస్తారని, అది మళ్ళీ ఒకటి రెండు కాదు, ఏకంగా ఇలాంటి మూడు సినిమాలు వచ్చే అవకాశం ఉందని, ముఖ్యంగా ఈ సినిమాలు పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్ల విషయం మీదనే ఉండొచ్చు అనేది వినికిడి.

ఇది నిజమేనా అన్న సందేహం వచ్చేవాళ్ళు కూడా అవకాశం లేకపోలేదు అంటున్నారు. ఎందుకంటే 2019 ఎన్నికల ముందు ఇలానే లక్ష్మీస్ ఎన్టీఆర్ అన్న సినిమా తీసి అందులో వైసీపీకి ఎదురుగా నిలిచిన కొంత మందిని ట్రోల్ చేసే ప్రయత్నం చేసారు వర్మ. అంతే కాకుండా లోగడ ఒకసారి పవర్ స్టార్ అనే ఇక చవకబారు షార్ట్ ఫిల్మ్ తీసిన సంగతి తెలిసిందే. ఇదే పంధా ఫాలో ఐతే పవన్ కళ్యాణ్ మీద సినిమాలు 2024 ఎన్నికల ముందు వచ్చే అవకాశం లేకపోలేదు మరి. 

ఈ వార్త నిజమా కాదా అన్న విషయం పక్కన పెడితే ఒక వ్యక్తిని కించ పరచడానికి ఎంచుకున్న ఈ దారి సరైనదేనా? రాజకీయ కొట్లాటలు కోసం కుటుంబ విషయాలని కూడా తెచ్చి సభా ప్రాయంగా మాట్లాడటం సరైన దారేనా? మీ ఒపీనియన్ పంచుకోండి.

Similar Links

0 comments:

Post a Comment