క్రేజీ డైరెక్టర్ పూరి జగన్నాథ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తెలుగు సినిమా చరిత్రలో హీరోయిజానికి కొత్త అర్థం చెప్పి తనదైన శైలిలో దూకుడు స్వభావం గల పాత్రలను ఒక్కో హీరోని ఒక్కోలా అయా పాత్రలను, డైలాగులను రూపొందిస్తూ ఒక స్టార్ డైరెక్టర్ గా ఎదిగారు.
అయితే ఆ తర్వాత కథల పై, పాత్ర చిత్రణల పై పట్టు కోల్పోతూ వచ్చారు. ఇక పూరికి హిట్ రాదేమో అన్న అనుమానం అందరిలోనూ ఉన్న సమయంలో.. ఇస్మార్ట్ శంకర్ సినిమా తో బ్లాక్ బస్టర్ సినిమాని అందించి.. ఇక పూరి మళ్ళీ సక్సెస్ ట్రాక్ పట్టారని పూరి అభిమానులు ఆశించారు.
ఇస్మార్ట్ తరువాత పూరి హీరో విజయ్ దేవరకొండతో కలిసి లైగర్ సినిమా తీసిన విషయం తెలిసిందే. అత్యంత హైప్ తో విపరీతమైన ప్రచారంతో వచ్చిన ఈ సినిమా ఎవ్వరూ ఊహించని విధంగా దారుణమైన డిజాస్టర్ గా నిలిచింది. బాక్సాఫీస్ సంగతి అలా ఉంచితే.. కథ కథనాల విషయంలో లైగర్ సినిమా అందరినీ తీవ్రంగా నిరాశపరిచింది. లైగర్ చిత్ర ఫలితం తర్వాత పూరి తర్వాత సినిమా ఎవరితో ఉంటుంది అన్న చర్చ ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాలలో నడుస్తుంది.
ఇప్పుడప్పుడే ఆయనతో సినిమాలు చేసేందుకు యే హీరో కూడా ముందుకి వచ్చి ధైర్యం చేసే పరిస్తితి కనిపించటం లేదు. ఇటీవలే పూరి తన తనయుడు ఆకాష్ తో ఒక ఒక సినిమా ప్లాన్ చేస్తున్నారని కొన్ని వార్తలు వచ్చినా.. ఆ తర్వాత ఆ సినిమా పై ఇతర సమాచారం ఏమీ రాలేదు.
కాగా పూరి ఇటీవలే మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్రం గాడ్ ఫాదర్ లో ఒక పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. జర్నలిస్ట్ పాత్రలో పూరి నటనకు ప్రేక్షకుల నుంచి మంచి మార్కులే పడ్డాయి. ఈ సందర్భంగా మెగాస్టార్ మరియు పూరి కలిసి ఇన్స్తాగ్రామ్ లో లైవ్ చాట్ లో పాల్గొన్నారు. ఆ చాట్ లో భాగంగా పూరి కాస్త భావోద్వేగానికి లోనయ్యారు.
అపజయాలు వచ్చినపుడు ఎవరూ తోడు ఉండరని, మన అనుకున్న వాళ్ళు కూడా వదిలేస్తారని పూరి అన్నారు. అయితే పరిస్థితులు బాగోలేనంత మాత్రాన తాను ఏమి కృంగిపోనని.. బాధ పడుతూ కూర్చోనని చెప్పారు. పూరి శైలి ఎప్పుడు కూడా ఇంతే. విజయంతో పాటు అపజయాన్ని కూడా ఆయన ఒకేలా స్వీకరిస్తూ ముందుకు వెళ్తూ ఉంటారు.
ఈ సందర్భంలోనే పూరి చిరును మీరు అపజయాలు వచ్చినప్పుడు ఎలా ఎదుర్కుంటారు అని అడగడం జరిగింది, చిరు చలొక్తిగా సమాధానం ఇస్తూ.. "నా ఆటో జానీ ను ఏం చేసారు పూరి" అని అడగడం తో పూరి లో ఒక నూతనోత్సాహం కనపడింది, అంతకన్నా మంచి స్క్రిప్ట్ రెడీ చేసి తెస్తాను సార్ అంటూ సమాధానం ఇచ్చారు పూరి.
మళ్ళీ తనదైన మార్క్ పక్కా మాస్ ఎంటర్టైనర్ తో పూరి తిరిగి విజయాల బాట పట్టాలని ఆశిద్దాం. ఆ అవకాశం చిరంజీవి గారు ఇచ్చినా ఆశ్చర్య పొక్కర్లేదు.
0 comments:
Post a Comment