సూపర్ స్టార్ కృష్ణ గారు నేడు ఉదయం 4:09కి తన తుది శ్వాస విడిచారు. డాక్టర్ల కధనం ప్రకారం నిన్న హార్ట్ స్ట్రోక్ తో హాస్పిటల్ లో అడ్మిట్ ఐన ఆయన మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ తో బాధపడటంతో వెంటిలేటర్ మీద పెట్టి ట్రీట్మెంట్ కొనసాగించారు. నేడు ఉదయం తన ఆఖరి శ్వాస విడిచారు.
టాలీవుడ్ కి ఇది ఒక తీరని లోటు, ఎందుకంటే కృష్ణ గారు తన సుదీర్ఘ సినీ ప్రస్తానంలో ఎప్పుడూ కొత్తదనం కోసం ప్రయత్నించి ప్రేక్షకులకి ఏదోక కొత్తదనాన్ని అందించేవారు. 1960 లో మొదలు ఐన ఆయన ప్రస్తానం ఐదు దశాబ్దాల పాటు కొనసాగింది. గత కొంత కాలంగా ఆయన పాత్రలకి దూరంగా ఉంటున్నారు. ఎన్నో వైవిధ్యమైన పాత్రలు చేసిన ఆయన డేరింగ్ అండ్ డాషింగ్ అన్న పేరు సంపాదించుకున్నారు.
ఆయన తెలుగు చిత్ర పరిశ్రమ కి అందించిన కొన్ని కొత్త పద్ధతులు..
- తేనేమనసులుతో టాలీవుడ్‌లో తొలి సోషల్ కలర్ మూవీ
- గూఢచారి 116తో టాలీవుడ్‌లో తొలి జేమ్స్ బాండ్ సినిమా
- మోసగాళ్లకి మోసగాడుతో టాలీవుడ్‌లో తొలి కౌ బాయ్ సినిమా
- ఈనాడుతో టాలీవుడ్‌లో తొలి ఈస్ట్‌మన్ కలర్ సినిమా
- సింహాసనంతో టాలీవుడ్‌లో తొలి 70ఎంఎం సినిమా
- తెలుగు వీర లేవరాతో టాలీవుడ్‌లో తొలి DTS సినిమా
- అల్లూరి సీతారామరాజుతో టాలీవుడ్‌లో తొలి సినిమాస్కోప్ సినిమా
ఇలాంటి ఎన్నో కొత్త టెక్నాలజీలను ఇండస్ట్రీకి పరిచయం చేసిన ఆయనను స్మరించుకోటానికి ఇవాళ షూటింగ్ కి సెలవు ప్రకటించింది టాలీవుడ్. అలానే మార్నింగ్ షోస్ కూడా రాష్ట్రమంతా కాన్సుల్ చెయ్యటం జరిగింది.
350 సినిమాల పైగా నటించిన ఆయన స్క్రీన్ మీదనే కాకుండా తెర వెనుక కూడా సినిమాకి సహాయపడేలా పద్మాలయ స్టూడియోస్ ని నిర్మించారు. ప్రస్తుతం ఇండస్ట్రీ లో ఉన్న లీడింగ్ స్టూడియోస్ లో ఇది ఒకటిగా కొనసాగుతుంది.
1943 మే 31వ తేదీన జన్మించిన ఈ నటుడు తన 79 ఏళ్ల వయసులో మరణించడం టాలీవుడ్‌లో తీరని వెలితి మిగిల్చింది. ఆయన పార్థివ దేహాన్ని ఫాన్స్ కోసం నేటి సాయంత్రం నుండి గచ్చిబౌలి స్టేడియం లో ఉంచుతారు.
ఆయన ఆత్మ కి శాంతి చేకూరాలని కోరుకుంటూ..ఓం శాంతి.
0 comments:
Post a Comment