యువ హీరో నితిన్, ఉప్పెన ఫేమ్ బేబమ్మ కృతిశెట్టి, కేథరిన్ థ్రేసా ప్రధాన పాత్రలలో నటించిన పొలిటికల్ యాక్షన్ చిత్రం'మాచర్ల నియోజకవర్గం'. ఆగస్ట్ 12న థియేటర్లో విడుదలైన సంగతి తెలిసిందే. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది. దారుణమైన డిజాస్టర్ తెచ్చుకున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద తొలి రోజే పతనాన్ని చవి చూసింది.
మాస్ హిట్ అందుకుందాం అనుకున్న హీరో నితిన్‌కు నిరాశే మిగిలింది. థియేటర్లలో పరాజయం పాలైన సినిమాలు మూడు నాలుగు వారాల్లోనే ఓటిటిలో విడుదలవుతున్న ఈ రోజుల్లో ఈ సినిమా మాత్రం ఓటిటి విడుదలకు చాలా చాలా గ్యాప్ తీసుకుంది.
అసలు ఈ సినిమా ఓటిటి లో విడుదల అవుతుందా లేదా అన్న అనుమానాలు కలుగుతున్న దశలో ఎట్టకేలకు ఓటీటీలోకి వచ్చేసిందీ మాచర్ల నియోజకవర్గం. ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ 'జీ 5'లో డిసెంబరు 9 నుంచి ఈ చిత్రం స్ట్రీమింగ్ కానున్నట్లు చిత్ర బృందం వెల్లడించింది. ఆ రకంగా చూసుకుంటే థియేట్రికల్ రిలీజ్ నుంచి సరిగ్గా 120 రోజులకు, అంటే నాలుగు నెలల తరువాత ఓటిటిలో అందుబాటులోకి వస్తుంది అన్నమాట.
ఇక మాచర్ల నియోజకవర్గం సినిమా కథ విషయానికి వస్తే.. ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా కలెక్టర్‌గా పోస్టింగ్ అందుకున్న హీరో ఫ్యాక్షన్‌ను తలపించే మాచర్ల నియోజకవర్గ రూపురేఖలను ఎలా మార్చాడు? అక్కడి పరిస్థితులను ఎలా చక్కదిద్దాడు? ఈ క్రమంలో హీరో ఎదుర్కొన్న సమస్యలు ఏంటి? అన్న కథాంశంతో నూతన దర్శకుడు ఎం.ఎస్.రాజశేఖర్ రెడ్డి తెరకెక్కించారు.
0 comments:
Post a Comment