RRR కి ఆస్కార్ మోక్షం దక్కేనా ?

Leave a Comment

 

గత కొంత కాలంగా నానుతున్న మాటే అయినా RRR కి ఆస్కార్ మోక్షం ఉందొ లేదో అని తెలిసే సమయం దగ్గర్లోనే ఉంది. ఎందుకంటే ఆస్కార్ కి వెళ్ళాలి అంటే మొదటి అడుగు అయిన మన దేశం తరఫునుండి వెళ్లాల్సిన సినిమా నామినేషన్లు త్వరలోనే తెలుస్తాయి మరి.

వాస్తవానికి RRR మన దేశం నుండి వెళ్లే నామినేషన్ గా ఉండటం లాంఛనమే అయినా ఎక్కడో ఒక మూల అవ్వకపోవొచ్చు అన్న సందేహం కూడా ఉంది. దానికి కారణం 'ది కాశ్మీర్ ఫైల్స్'. ఈ చిన్న సినిమా పెద్ద చెప్పుకునే స్టార్ కాస్ట్ లేకపోయినా బాక్స్ ఆఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపించింది, ఎంతలా అంటే ఈ సంవత్సరం టాప్ 5 చిత్రాల్లో ఇది ఒకటి. కాశ్మీర్ పండిట్స్ మీద జరిగిన ఆకృత్యాలు మీద తీసిన ఈ చిత్రం ప్రేక్షకులని వెండి తెర కి కట్టిపడేసింది. 

మొదట్లో నాని సాయి పల్లవి నటించిన రాహుల్ సంక్రీత్యాన్ దర్శకత్వం లో వచ్చిన శ్యామ్ సింఘారాయ్ కూడా బరిలో ఉండచ్చు అనే గుస గుసలు వినిపించాయి. కానీ వాస్తవికంగా జరిగిన సంఘటనల రీత్యా తీసిన "ది కాశ్మీర్ ఫైల్స్" చిత్రం ఒక్కటే ఇప్పుడు RRR కి మరియు దేశం నుండి వెళ్లే ఆస్కార్ నామినేషన్స్ కి మధ్య ఉన్నది. ఈ పరిస్థితిలో ఫాన్స్ తమ వంతుగా #RRRForOscars అని తమకు కావాల్సిన ఛాయస్ ఇది అని సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా చెప్తున్నారు.

ఒక వేళ భారత దేశం నుండి నామినేషన్ గా వెళ్లినా మనకి ఆస్కార్ నామినేషన్ వచ్చేస్తుంది అన్న గారంటీ లేదు. ఎందుకంటే ఈ నామినేట్ చేసిన చిత్రాలన్నీ జ్యూరీ చూసి వాళ్లకి నచ్చిన చిత్రాలకి వోటింగ్ వేసి అందులో ఎక్కువ శాతం వోటింగ్ వచ్చిన చిత్రాలని నామినేషన్ కి పంపిస్తారు. అందులో నుండి అవార్డు దేనికి వస్తుంది అనేది మరో ప్రక్రియ.

ఇన్ని అడుగుల ఈ దారిలో.. మన ఇన్ని సంవత్సరాల సుదీర్ఘ సినిమా ప్రయాణంలో భారతదేశం నుండి చివరి వరకు వెళ్లి నిలిచి గెలిచిన చిత్రాలేమి లేవు . #RRR కి ప్రపంచం మూల మూలలా వచ్చిన పేరుకి ఇది మన బెస్ట్ ఛాన్స్ అని చెప్పటం లో సందేహం ఎం లేదు. మరి ఇదే అభిప్రాయం మన నుండి వెళ్లే నామినేషన్ లో కూడా కనిపిస్తుందా? త్వరలోనే చూద్దాం మరి.

Similar Links

0 comments:

Post a Comment