వారసుడిగా రానున్న మహర్షి?

Leave a Comment


 

సూపర్ స్టార్ మహేష్ బాబుతో తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మహర్షిని తెరకెక్కించిన దర్శకుడు వంశీ పైడిపల్లి.

ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్ద హిట్ అవడంతో పాటు ఎన్నో ప్రశంసలను అలాగే జాతీయ అవార్డు కూడా అందుకుంది.

ఆ తర్వాత దర్శకుడు వంశీతో మహేష్ బాబు మరో సినిమా చేయాలని ప్లాన్ చేసారు, అయితే కొన్ని కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్ ఆగిపోయింది. ఇక వంశీ పైడిపల్లి ఆ తర్వాత తమిళ సూపర్ స్టార్ విజయ్‌ని వారిసు అనే అద్భుతమైన స్క్రిప్ట్ చెప్పి ఒప్పించారు. తమిళంలో రూపొందుతున్న ఈ చిత్రం తెలుగులోకి వారసుడు పేరుతో డబ్ అవుతోంది.

ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ చిత్రానికి సంబంధించిన కొన్ని స్టిల్స్ ను వారిసు టీమ్ విడుదల చేసింది. ఈ చిత్రాలను పరిశీలిస్తే, చాలా మంది నెటిజన్లు వారిసు సినిమా మహర్షి సినిమాకు దగ్గరగా ఉందని కొన్ని పోలికలు తెస్తున్నారు.

కాగా ఈ చిత్రం నుండి దళపతి విజయ్ ఫస్ట్ లుక్, అతని కాస్ట్యూమ్‌ కూడా మహర్షిని పోలి ఉంటుంది. ఇక ఈ చిత్ర కథాంశం ఫ్రెంచ్ చిత్రం లార్గో వించ్‌తో సారూప్యతను కలిగి ఉందని లోగడ కొన్ని వార్తలు వచ్చాయి. లార్గో వించ్ సినిమాకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తెలుగు సినిమా అజ్ఞాతవాసి లార్గో వించ్ యొక్క ఫ్రీమేక్ గా తెరకెక్కిందని అప్పట్లో వివాదం చెలరేగిన విషయం తెలిసిందే.

హీరో లుక్ మాత్రమే కాదు, వారిసు చిత్రానికి సంబంధించిన సపోర్టింగ్ కాస్ట్ లుక్స్ కూడా మనకు మహర్షి సినిమాను గుర్తుకు తెచ్చేలా ఉన్నాయి. మరి ఈ పోలికలు నిజమో కాదో తెలియాలంటే టీజర్ లేదా ట్రైలర్ వస్తే తప్ప ఒక క్లారిటీ రాదనే చెప్పాలి.Similar Links

0 comments:

Post a Comment