Dhamaka: ధమాకా ఓటీటీ స్ట్రీమింగ్ పార్టనర్ ఫిక్స్

Leave a Comment
Raviteja's Dhamaka OTT streaming details


రవితేజ, శ్రీలీల జంటగా నటించిన ధమాకా చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఈ శుక్రవారం విడుదలైంది. డిసెంబర్ 23న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మిశ్రమ సమీక్షలను తెచ్చుకున్నప్పటికీ.. మాస్ ప్రేక్షకుల నుండి చక్కని ఆదరణను పొందుతూ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లను రాబడుతూ సూపర్ హిట్ దిశగా అడుగులు వేస్తుంది. 

దర్శకుడు త్రినాథరావు నక్కిన దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఆయన కెరీర్ లో మరో విజయాన్ని సాధించినట్లే అని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి 

తాజాగా ఓటీటీ దిగ్గజం నెట్ ఫ్లిక్స్ ధమాకా సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రాబోయే వారాల్లో ప్రకటించబడుతుంది.

ధమాకా చిత్రంలో రవితేజ మాస్ డైలాగ్స్, మేనరిజమ్స్ తో పాటు, శ్రీలీల ఎనర్జీ మరియు డ్యాన్స్ లు ప్రేక్షకులకి బాగా నచ్చాయి.

కాగా ఈ చిత్రంలో రావు రమేష్, జయరామ్, సచిన్ ఖేడ్కర్, ప్రవీణ్, తనికెళ్ళ భరణి, పవిత్ర లోకేష్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి భీమ్స్ సిసిరిలియో సంగీతం అందించారు

Similar Links

0 comments:

Post a Comment