మహేష్ ప్రభాస్ లను దాటేసిన రామ్ చరణ్

Leave a Comment

 


సినిమా ఇండస్ట్రీలో హీరోల మధ్య పోటీ ఉండటం సర్వ సాధారణమే. ఒక హీరో హిట్ సినిమా కలెక్షన్ల కన్నా మరో హీరో సినిమా కలెక్షన్లు ఎక్కువగా ఉండటం..లేదా ఒకేసారి సంక్రాంతి లేదా దసరా పండగల సందర్భంగా ఇద్దరు హీరోలు పోటీగా సినిమాలు విడుదల చేయడం మనం చూస్తూనే ఉంటాం.

ఈ పోటీ అనేది ఎప్పుడూ ఉండేదే.. అయితే గత కొన్నేళ్లుగా సోషల్ మీడియా హవా పెరిగింది. అందుకు తగ్గట్టే హీరోలు సెలబ్రిటీలు కూడా ట్విట్టర్ ఇన్స్టాగ్రామ్ లలో తమ పోస్టులలో అభిమానులని, ప్రేక్షకులకి ఆకట్టుకుంటూ ఉండటం అలవాటు చేసుకున్నారు. తాజాగా హీరో రామ్ చరణ్ సోషల్ మీడియాలో ఒక అరుదైన రికార్డు దక్కించుకున్నారు.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇన్‌స్టాగ్రామ్‌లో 9 మిలియన్ల ఫాలోవర్లను అత్యంత వేగంగా సాధించిన సెలబ్రిటీ అయ్యారు. దీనితో ఈ RRR స్టార్.. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మరియు సూపర్ స్టార్ మహేష్ బాబు రికార్డును అధిగమించారు. ప్రభాస్ మరియు మహేష్ బాబులకు ఇన్‌స్టాగ్రామ్‌లో 8.9 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు.రామ్ చరణ్ జూలై 2019లో ఇన్‌స్టాగ్రామ్‌లోకి అడుగుపెట్టారు. కాగా తన తొలి ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌ను తన తల్లికి అంకితం చేయడం విశేషం.

ఇక సినిమాల విషయానికి వస్తే, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం దక్షిణ భారత దిగ్గజ దర్శకులలో ఒకరైన శంకర్ షణ్ముగంతో కలిసి రాజకీయ నేపథ్యంలో ఒక యాక్షన్ ఎంటర్టైనర్ కోసం పని చేస్తున్నారు. ఈ చిత్రానికి అధికారికంగా టైటిల్ ఇంకా ప్రకటించలేదు. అయితే తాత్కాలికంగా RC15 అనే వర్కింగ్ టైటిల్ ప్రచారంలో ఉంది.

అగ్ర నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాని ప్యాన్ ఇండియా స్థాయిలో భారీ ఎత్తున తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో కియారా అద్వానీ కథానాయికగా నటిస్తున్నారు. ఎస్ థమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం 2023లో ప్రేక్షకుల ముందుకు రానుంది.


Similar Links

0 comments:

Post a Comment