దుమ్ము రేపుతున్న బాస్ పార్టీ సాంగ్

Leave a Comment
Boss Party Song is a blockbuster


మెగాస్టార్ చిరంజీవి, బాబీ కొల్లి, మైత్రీ మూవీ మేకర్స్ 'వాల్తేరు వీరయ్య' ఫస్ట్ సింగిల్ 'బాస్ పార్టీ' 25 +మిలియన్ వ్యూస్ తో బ్లాక్ బస్టర్ హిట్ 

మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు బాబీ కొల్లి (కెఎస్ రవీంద్ర)ల క్రేజీ మెగా మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'వాల్తేరు వీరయ్య' అభిమానులకు, ప్రేక్షకులకు థియేటర్లలో పూనకాలు తెప్పించడానికి సిద్ధంగా ఉంది. ఇప్పటికే వాల్తేరు వీరయ్య ప్రమోషనల్ కంటెంట్ సినిమా పై భారీ అంచనాలని పెంచింది.

వాల్తేరు వీరయ్య మ్యూజికల్ ప్రమోషన్‌లు బ్లాక్ బస్టర్ నోట్‌లో ప్రారంభమయ్యాయి. ఇటివలే విడుదలైన ఫస్ట్ సింగల్ 'బాస్ పార్టీ'.. పార్టీ సాంగ్ ఆఫ్ ది ఇయర్‌గా అలరిస్తోంది. 'బాస్ పార్టీ' సాంగ్ 25 +మిలియన్ వ్యూస్ క్రాస్ చేసి యూట్యూబ్ లో టాప్ ట్రెండింగ్ లో కొనసాగుతోంది. ఇన్స్టా, ఫేస్ బుక్ లాంటి సోషల్ మీడియా ఫ్లాట్ఫామ్స్ లో రీల్స్ రూపంలో కూడా బాస్ పార్టీ' సాంగ్ వైరల్ గా మారి బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది.  

'వాల్తేరు వీరయ్య' నుండి తాజాగా విడుదలైన మాస్ మహారాజా రవితేజ ఫస్ట్ లుక్ టీజర్ కి కూడా ట్రెమండస్ రెస్పాన్స్ వస్తోంది. పవర్ ఫుల్ పోలీస్-విక్రమ్ సాగర్ ఏసీపీగా రవితేజ ఎంట్రీ మాస్ కి పూనకాలు తెప్పిస్తోంది. మెగాస్టార్ చిరంజీవి- మాస్ మహారాజా రవితేజలని ఎప్పుడెప్పుడు తెరపై చూద్దామానే క్యూరీరియాసిటీ అభిమానులు, ప్రేక్షకుల్లో నెలకొంది. 

ఈ చిత్రంలో చిరంజీవి సరసన శృతి హాసన్ కథానాయికగా నటిస్తుండగా, ప్రస్తుతం యూరప్‌లో లీడ్‌ పెయిర్‌పై పాటల చిత్రీకరణ జరుగుతోంది. ఈ చిత్రానికి రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.  

మైత్రీ మూవీ మేకర్స్‌పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జికె మోహన్ సహ నిర్మాత. 

ఆర్థర్ ఎ విల్సన్ కెమెరామెన్ గా, నిరంజన్‌ దేవరమానె ఎడిటర్‌గా, ఎఎస్‌ ప్రకాష్‌ ప్రొడక్షన్‌ డిజైనర్‌గా పని చేస్తున్న ఈ చిత్రానికి సుష్మిత కొణిదెల కాస్ట్యూమ్ డిజైనర్.

ఈ చిత్రానికి బాబీ కథ, మాటలు రాయగా, కోన వెంకట్, కె చక్రవర్తి రెడ్డి స్క్రీన్‌ప్లే అందిస్తున్నారు. రైటింగ్ డిపార్ట్‌మెంట్‌లో హరి మోహన కృష్ణ, వినీత్ పొట్లూరి కూడా పనిచేస్తున్నారు. 

సినిమా టాకీ పార్ట్ మొత్తం పూర్తయింది. చివరి పాటను ప్రస్తుతం యూరప్‌లో చిరంజీవి, శృతి హాసన్‌లపై చిత్రీకరిస్తున్నారు.

'వాల్తేరు వీరయ్య' జనవరి 13, 2023న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా ప్రేక్షకుల ముందుకు రానుంది.


నటీనటులు: చిరంజీవి, రవితేజ, శృతి హాసన్ తదితరులు.

సాంకేతిక విభాగం: 

కథ, మాటలు, దర్శకత్వం: కేఎస్ రవీంద్ర (బాబీ కొల్లి)

నిర్మాతలు: నవీన్ యెర్నేని, వై రవిశంకర్

బ్యానర్: మైత్రీ మూవీ మేకర్స్

సంగీతం: దేవి శ్రీ ప్రసాద్

డీవోపీ: ఆర్థర్ ఎ విల్సన్

ఎడిటర్: నిరంజన్ దేవరమానే

ప్రొడక్షన్ డిజైనర్: ఏఎస్ ప్రకాష్

సహ నిర్మాతలు: జీకే మోహన్, ప్రవీణ్ ఎం

స్క్రీన్ ప్లే: కోన వెంకట్, కె చక్రవర్తి రెడ్డి

ఎడిషినల్ రైటింగ్: హరి మోహన కృష్ణ, వినీత్ పొట్లూరి

సిఈవో: చెర్రీ

కాస్ట్యూమ్ డిజైనర్: సుస్మిత కొణిదెల

లైన్ ప్రొడ్యూసర్: బాలసుబ్రహ్మణ్యం కె.వి.వి

పీఆర్వో: వంశీ-శేఖర్

పబ్లిసిటీ: బాబా సాయి కుమార్

మార్కెటింగ్: ఫస్ట్ షో

Similar Links

0 comments:

Post a Comment